![]() |
![]() |

గుప్పెడంత మనసు సీరియల్ లో జగతి రోల్ లో నటించిన జ్యోతి పూర్వజ్ గురించి తెలియని వారుండరు. అందమైన తల్లిగా ఆ సీరియల్ లో నటించి ఎంతోమందిని మెప్పించింది. అలాంటి జ్యోతి పూర్వజ్ రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో "ప్రశ్నలు అడగండి...రైట్ క్వశ్చన్స్ కె ఆన్సర్ ఇస్తా " అని చెప్పింది. దాంతో చాలామంది చాలా ప్రశ్నలు అడిగారు. "నీ పేరేంటి" "డోనాల్డ్ ట్రంప్". "పవన్ కళ్యాణ్ తో ఎప్పుడు నటిస్తున్నారు.. ఆయనలో నచ్చింది ఏంటి" "వచ్చే ఏడాది. మంచి మనిషి", "ఛాన్స్ వస్తే హాలీవుడ్ కి వెళ్తారా బాలీవుడ్ కా" "హాలీవుడ్ కి ", "ఇంతకు మీ వయసెంత" "ఇదిగో పాన్ కార్డు చూసుకోండి 1994 జులై". "కిల్లర్ మూవీలో కాకుండా ఇంకా ఎందులో నటిస్తున్నారు" "ఏ మాస్టర్ పీస్ తెలుగులో, కన్నడలో హల్కా డాన్ ..ఈ ఏడాది విడుదలవుతున్నాయి ".
"మహేష్ బాబు గారి గురించి ఒక్కమాటలో" "చాలా హై ఎనర్జీ నటుడు " "శ్రద్దా కపూర్ కంటే క్యూట్ గా మలైకా కంటే హాట్ గా ఉంటారు ". "అల్లు అర్జున్ గురించి " " బెస్ట్ పెర్ఫార్మర్" "యాక్టర్ ప్రభాస్ గురించి "క్యూట్" " ధనుష్ సర్ గురించి ఒక్క మాటలో" "పెర్ఫార్మర్" "తారక్ అన్న గురించి " "టైగర్" "రామ్ చరణ్ సర్ గురించి" "హార్డ్ వర్కింగ్ పెర్ఫార్మర్, పర్ఫెక్షనిస్ట్" "కిచ్చ సుదీప్ సర్ గురించి" "స్టైలిష్, పవర్ఫుల్ పెర్ఫార్మర్" " చిరంజీవి సర్ గురించి" "ది మైటీ మెగాస్టార్ ..మంచి మనసున్న వ్యక్తి" అంటూ నెటిజన్స్ అడిగిన ప్రశ్నలకు టకాటకా ఆన్సర్స్ ని తన ఇన్స్టా స్టేటస్ లో పోస్ట్ చేసింది.
![]() |
![]() |